సాయి కాళేశ్వర్ మృతిపై కొత్తకోణం
Published on: Wed Mar 21, 2012 3:02PM
పెనుకొండ గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ సాయికాళేశ్వర్ మృతిపై కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హఠాత్తుగా మృతిచెందారు. అయితే ఆయనకు ఉన్న అనారోగ్యం ఏమిటన్న దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కాని సాయికాళేశ్వర్ చుట్టూ ఉన్న కొంతమంది పెద్దలు ఆయనను వ్యసనపరుడిగా మార్చాలని ఆ వ్యసనమే ఆయనకు ప్రాణాంతకంగా మారిందని తెలిసింది. సాయికాళేశ్వర్ ను ఎప్పుడూ వెన్నంటి వుండే నలుగురు వ్యక్తులు ఆయనకు మద్యాన్ని, మాదకద్రవ్యాలను అలవాటు చేసినట్టు తెలిసింది. ఈ అలవాట్లవల్ల ఆయన కాలేయం బాగా దెబ్బతిందని, దీంతో తరచుగా అస్వస్తతకు గురయ్యేవారని తెలియవచ్చింది. దీనికితోడు మాదక ద్రవ్యాలకు కూడా ఆయన అలవాటు పడ్డారని తెలిసింది. మాదక ద్రవ్యాలు సేవించిన సమయంలో ఆయన చేష్టలు వింతగా ఉండేవని, ఊరి చివరకు వెళ్ళి ఒంటరిగా చాలాసేపు గడిపేవారని, అప్పుడప్పుడూ బిగ్గరగా ఎడ్చేవారని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. మద్యపానం, మాదకద్రవ్యాల కారణంగానే సాయికాళేశ్వర్ మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు సైతం భావిస్తున్నారు.


