నేనయితే వెంటనే రిటైర్మెంట్ తీసుకోనేవాడిని: గంగూలి

 

మొన్న కొల్కోట ఈడెన్ గార్డెన్స్ లో పేలవమయిన ప్రదర్శన ఇచ్చిన సచిన్ టెండూల్కర్ ఆటతీరుపై స్పందిస్తూ, ‘బెంగాలీ దాదా’ సౌరభ్ గంగూలి మీడియాతో మాట్లాడుతూ “ఒక మేటి బ్యాట్స్ మ్యాన్నుంచి ఆశించవలసిన ఆట కాదు అది. ఈ సిరీస్ లో సచిన్ సగటు పరుగులు కేవలం 22 మాత్రమె. అతని అత్యదిక స్కోరు కేవలం 76 పరుగులు మాత్రమె. అతనిని నుండి ఏంతో ఆశించిన అభిమానులు, నేనుకూడా చాలా నిరాశకి గురయ్యాము. నేనే అతని స్తానంలో ఉండిఉంటె ఈ విధమయిన పేలవమయిన ఆట ఆడేబదులు తప్పక టీంనుండి వైదోలగుతూ రిటైర్మెంట్ తీసుకోనేవాడిని,” అని అన్నాడు.

 

అసలే సచిన్ ఆట తీరుపై అన్నివైపులనుండీ విమర్శలు జడివానలా కురుస్తుండగా, ఇప్పుడు గంగూలి చేసిన వ్యాక్యలతో సచిన్ పరిస్తితి మరింత ఘోరంగా మారింది. తన ఆట తీరుని గమనించుకొని కూడా, అందరు రిటైర్మెంట్ తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాకూడా, ఇంకా తన పేలవమయిన ప్రదర్శన కొనసాగిస్తూ, ఇంత కాలం తానూ కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలను తానే తుడిచిపెట్టేసుకొంటున్నడేమో అతను ఆలోచించాలి. మరింత అవమానకర పరిస్తితుల్లో నిష్క్రమించడం కన్నా, పూర్తిగా పరువుపోక మునుపే ఇప్పుడే హుందాగా తప్పుకొంటే బాగుంటుందేమో అతను ఆలోచించాలి.