Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ ప్లేస్ లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ యువ నేత!!
posted on: Jul 6, 2019 7:03PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగటానికి ససేమిరా అనటంతో మోతిలాల్ వోరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఐతే ఇప్పుడు పర్మనెంట్ అధ్యక్షుడి వేటలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది. ఈ క్రమంలో యువనేతకు పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రేసులో రాజస్తాన్ డిప్యూటీ సీఎం కాంగ్రెస్స యువ నేత సచిన్ పైలెట్ ఉన్నట్టు తాజా సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ తాజా ట్వీట్‌ను బట్టి చూస్తే సచిన్ పైలెట్ కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ఫస్ట్ ఉన్నారు. "అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీమానా చేయడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. అయితే, యంగ్ ఇండియాకు యువనాయకత్వం చాలా అవసరం. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ దృష్టిలో పెట్టుకోవాలి. దేశంలో ఉన్న యువతను, క్షేత్రస్థాయిలో ఆకట్టుకునేలా నాయకుడిని ఎంపిక చేయాలి". అని కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉండగా రాజస్తాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సమావేశం అయ్యారు. దీంతో సచిన్ పైలెట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది.






