సబితకు సెల్యూట్ ఎలా చేస్తారు

posted on: Apr 13, 2013 5:42PM

 

 

Sabitha Indra Reddy, cpi narayana jagan, jagan cbi, Sabitha Indra Reddy jagan case

 

 

అవినీతి మంత్రి సబితను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సీబీఐ చార్జిషీట్‌లో ఏ4 నిందితురాలుగా ఉన్న సబితకు పోలీసులు సెల్యూట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న విపక్షాలను కించపర్చేలా సీఎం కిరణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

 

రాజకీయ, ఆర్థిక నేరస్తుడు జగన్ అని నారాయణ దుయ్యబట్టారు. జైల్లో ఉన్న అలాంటి వ్యక్తి వద్దకు వెళ్లి బి పారాలు అడుక్కునే స్థితికి రాజకీయాలు దిగజారడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ పార్టీలోకి వెళ్లిన వారికి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...