సభా సమయం

posted on: Sep 29, 2013 3:03PM

 

ప్రస్థుతం దేశ వ్యాప్తంగా సభా సమయం నడుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ సకల జన భేరి సాగుతుండగా, అదే సమయంలో సీమాంద్ర జిల్లాల్లో నిరసనలతో పాటు కర్నూలులో లక్షగళ ఘోష జరుగుతుంది. వీటితో పాటు ఢిల్లీలో బిజిపి ఆధ్వర్యంలో నరేంద్రమోడి భారీ సభను నిర్వహిస్తున్నారు దీంతో అధిష్టానం ఈ సభలపై కేంద్ర ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రికరించింది.

ఇటీవల హైదరాబాద్‌లో సీమాంద్రులు నిర్వహించిన సభకు మంచి స్పందన రావటంతో ఈ రోజు తెలంగాణ వాదులు తలపెట్టిన సభను ఘనవిజయంగా చూపాలని టిఆర్‌ఎస్ తో పాటు అన్ని వర్గాలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. గత 60 రోజులుగా ఉద్యమంలో ఉన్న సీమాంద్రులు కూడా లక్ష గళ ఘోషలతో హోరెత్తిస్తున్నారు.

వీటికి తోడు ఢిల్లీలో బిజెపి ఎన్నికల సారథి నరేంద్ర మోడి తలపెట్టిన సభ కాంగ్రెస్‌ పెద్దల గుండెల్లో రైళ్లు పరెగెత్తిస్తుంది. తన పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి సోనియా టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సందిస్తున్న మోడి ఈ రో్జు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...