రికార్డు స్థాయికి రూపాయి పతనం

posted on: Mar 4, 2026 12:02PM

గతంలో ఎన్నడూ లేనంద దిగువకు రూపాయి పతనమైంది. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పతనమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే..రూ.92 దిగువకు పడిపోయింది.  యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు   పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కారణంగా రూపాయి రికార్డు స్థాయిలో పతనమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరో వైపు యుద్ధ ప్రభావం భారత  స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగా పడింది.  బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు భారీగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజు లావాదేవీల్లోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన దాదాపు రూ. 9.7 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...