Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పారిశుధ్య ప్రాధాన్యత తెలుసుకోవాలి!
posted on: Jul 13, 2022 2:04PM
కంటి కింద పులిపిరికాయ, గీరల టీ షర్టు, లుంగీతో బెదిరించి మరీ వసూలు చేసేది దాదాగిరీ తాలూకు ఫీజు. చేయించుకున్న వెధవ పనికి ఆ వచ్చిన వాడికి అడిగినంతా ఇవ్వక తప్పదు సదరు ధనికుడికి.. ఇది పాత సినిమాల్లో, కథల్లో విలన్ అసిస్టెంట్ల తీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వుంది. మున్సిపల్ కార్మికులచేత నడుం విరిగేలా పనిచేయించుకుంటూ వారికి జీతాలు ఇవ్వకపోగా చెత్త మీద పన్ను విధించి వసూలు చేయడానికి హెచ్చరికలూ చేయడం. రాష్ట్రంలో కనీసం మున్సిపల్ వ్యవస్థా సరిగా పనిచేయడం లేదన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ.
అధికారంలోకి రాగానే నూతనోత్సాహంతో ముఖ్యమంత్రిగా జగన్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచుతు న్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లకు ప్రభుత్వానికి తమపై కాసింత ప్రేమ, దయా కలిగిందని పాపం వారంతా తెగ ఆనందపడ్డారు. ఆ ఆనందంలో మూడు షిఫ్ట్‌లూ పనిచేసి రోడ్లను అద్దంగా చేయడానికి శ్రమిస్తు న్నా రు. కానీ రాజుగారి నీతి వాక్యాలన్నీ అమలు కావన్న సంగతి కార్మికులకు బ్యాంకులకు వెళ్లి డబ్బులు అడి గితేగాని తెలియలేదు. ప్రభుత్వం ప్రకటించిన పద్దెనిమిది వేలు కాకుండా ముందు ఇస్తున్న పదిహేను వేలే అందుకుంటున్నారు.
కనీసం ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వకపోగా, వారి గోడు వినిపించుకొనకపోవడంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తం గా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల విషయంలో ఇంత కాలం ఓపిక పట్టిన వారు ఇప్పుడు రోడ్డెక్కి సమ్మె ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా చెత్తపన్నును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది.
ఈ ప్రకారం పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. చెత్త పన్ను ఇవ్వకపోతే చెత్త ఇంటి ముందు పోయ్యాలనే హెచ్చరికలు కూడా మంత్రుల స్థాయి నేతలు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాల విషయం మాత్రం మాట్లాడటం లేదు. అసలు అన్నింటికీ మించి మరీ విచిత్రమేమంటే.. మళ్లీ అధి కారంలోకి వస్తే జీతాలు పెంచుతామని మం త్రులు చెప్పడం. ప్రజలు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు ఈ మాటలు విని నవ్వాలో, ఏడవాలో అర్ధం గాని సందిగ్ధంలో వున్నారు.
అధికారంలో వున్నవారు, జీతాలు ఇవ్వాల్సినవారు ఇలాంటి జోకులు వేస్తే తట్టుకునే శక్తి సామాన్య కార్మికులకు ఎలా వుంటుందన్న ధ్యాస సదరు మంత్రులకు లేకపోవడమే విచిత్రం. మరి పారిశుధ్యం ఎవరికి అవసరం?



.webp)


