Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా కాసులు మోత..
posted on: Jun 2, 2021 12:31PM
కరోనా కొంత మంది ఇంట్లో దుఃఖాన్ని నింపితే.. ఇంకొంత మంది గళ్ళ నిండుతుంది. చనిపోయిన శవాల దగ్గర కూడా చిల్లర ఏరుకుంటున్నారు. మరి తెలంగాణలో కరోనా విలయం తో పాటు పైవేట్ హాస్పిటల్ రోగులపై కొరడా విసుతున్నయి. అందినంత దొంచుకోవడమే పైవేట్ హాస్పిటల్ పనిగా మారింది. మొన్నటికి మొన్న విరించి హాస్పిటల్ లో 20 లక్షలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటే, అతనికి చెల్లి తన అన్నాను చంపారని, ఒక లేడీ డాక్టర్ తన కుటుంబ సభ్యులతో, బంధువులతో హాస్పిటల్ ముంది బైఠాయించారు. ఆ సంఘటన మరిచిపోక ముందే హైదరాబాద్ లో మరో ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం బయట పడింది. రోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా డబ్బుల కోసం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల చీకటి కోణాలు వెలుగుచూడటంతో వైద్యారోగ్యశాఖ వాటిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఇంకా బుద్ది మార్చుకోవడం లేదు. కాసుల వేటలో పడి కరోనా రోగుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.5లక్షలు చెల్లించాలని బాధిత కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. భాస్కర్ అనే యువకుడు ఇటీవల కరోనా బారిన పడటంతో ఆదిత్య ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.5లక్షలు చెల్లిస్తే గానీ డెడ్ బాడీ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
మరో వైపు బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్..
మారదు లోకం మారాడు కాలం..దేవుడు దిగి రాని.. ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం .. మారదు కాలం .. ఒక వైపు కరోనా తాజగా మరో వైపు బ్లాక్‌ఫంగస్ తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వారి ప్రాణాలతో చెలగాటం ఆగుతున్నారు కొంత మంది దుండగులు బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముగ్గురిని ఏస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈసీఎల్ చౌరస్తాలో బ్లాక్ ఫంగస్ ఒక్కో ఇంజెక్షను రూ.30 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పూజారి నవీన్ కుమార్ (25), గ్రందే కిషోర్ (42), దబ్బారెడ్డి వెంకటేష్ (25) బోరబండ, మోతినగర్ ప్రాంతానికి చెందిన వీరు బ్లాక్ లో అమ్ముతుండా ఏస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుల నుంచి మూడు ఇంజెక్షన్లు, మూడు సెల్ ఫోన్లు, హ్యూండాయ్ ఎక్స్ంట్ కారు, 1,460 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.


.jpeg)


