విజయానికి చేరువలో ఆపరేషన్ వశిష్ట.. బోటు నిజంగానే బయటకు రాబోతోందా?

 

గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావోస్తున్నా ఇప్పటికి బోటు బయటకు రాలేదు.నిన్న ఆపరేషన్ వశిష్ట మళ్ళీ ప్రారంభించిన సత్యం బృందం ఆపరేషన్ వశిష్ట పార్ట్ 2 విజయవంతమవుతున్నట్లే అనిపిస్తోంది. ధర్మాడి సత్యం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం కనిపిస్తుంది. గోదావరి వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో పెద్ద లంగర్ కు రాయల్ వశిష్ట బోటు తగిలింది. ప్రస్తుతం దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. 

రాయల్ వశిష్ట బోటును కచ్చులూరు మంద వద్ద వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపుగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పంట్లు సాయం తోటి కావాల్సినటువంటి ఐరన్ రోప్ లో నైలాన్ తాళ్ళు బలమైన లంగరుల తోటి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కచ్చులూరుకు సత్యం బృందం చేరుకుంది. అక్కడకు చేరుకున్న తర్వాత మూడు నాటు పడవల్లో విడివిడి గా మూడు బృందా లు మూడు లంగర్లు చిన్న లంగర్ లు తీసుకుని బోటు మునిగిన ప్రాంతంలో  లంగరు వేస్తూ గాలించే ప్రయత్నం చేసింది సత్యం బృందం.

అయితే కొద్ది సేపటి క్రితమే ఒక బరువైన వస్తువు లంగర్ కు చిక్కినట్లు సత్యం బృందం వెల్లడిస్తోంది.బోటును బయటకు లాగటానికి కావాల్సిన ఐరన్ రోపులను,నైలాన్ తాడుల సహయంతో,పంటు సహయంతో లంగర్ కు తగిలిన బలమైన వస్తువును ఎట్టి పరిస్థితిలో బయటకు తీసేందుకు ఇరవై ఐదు మంది ఉన్న బృందంతో సిద్ధమైయ్యింది.ఎట్టి పరిస్థితిలో ఈ రోజు బోటును బయటకు తెచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఈ రోజు ఐనా బోటుకు ఏ ఆటంకాలు లేకుండా బయటకు వస్తోందో లేదో వేచి చూడాలి.