రోజాకి వడదెబ్బ.. ఆస్పత్రిలో చికిత్స

posted on: May 2, 2014 3:43PM

 

 

 

నగరి నుంచి పోటీ చేసీ చేసీ ఓడిపోతూ వస్తున్న రోజా మరోసారి నగర నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో వున్నారు. ఈసారి కూడా రోజా గెలిచే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో రోజా ప్రచారం చేస్తున్నారు. భగభగ మండుతున్న ఎండని కూడా లెక్క చేయకుండా రోజా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుక్రవారం నాడు నియోజవర్గం పరిధిలోని ఏకాంబరకుప్పంలో ప్రచారం చేస్తున్న రోజాకి భారీ స్థాయిలో వడదెబ్బ తగిలింది. దాంతో ఆమె అక్కడికక్కడే కళ్ళు తిరిగిపడిపోయింది. రోజాకి వడదెబ్బ తగిలిన విషయాన్ని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...