Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోహిత్ శర్మ వీరబాదుడు... రెండు వరల్డ్ రికార్డులు
posted on: Nov 13, 2014 4:20PM

శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్’లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. తుది రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీని పూర్తిచేశాడు. అర్ధ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తరువాత పదునైన షాట్లతో అలరించాడు. సెంచరీ చేయడానికి 100 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. మరో సెంచరీకి 50 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ తాజా డబుల్ సెంచరీతో రోహిత్ శర్మ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ ఆటగాడు మరోసారి సింహంలా జూలు విదిల్చాడు. ఈ మ్యాచ్‌లోనే వీరేంద్ర సెహ్వాగ్ వన్డే రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు. గతంలో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 పరుగుల రికార్డును రోహిత్ బద్దలు కొట్టి ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ మొత్తం 264 నాలుగు పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. చివరి బంతికి రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 404 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గతంలో కూడా డబుల్ సెంచరీ చేశాడు. రెండుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్ శర్మదే.






