Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మా ఫొటోలు మార్ఫింగ్ చేశారు...
posted on: May 18, 2015 1:05PM

హర్యానాలోని రోహతక్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమను బస్సులో ఏడిపించిన ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. తమ మీద కక్ష సాధించడానికి ఆ ఆకతాయిలు తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారని, వారిని అరెస్టు చేయాలని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు పూజ, ఆరతి ఆందోళన చేపట్టారు. వీరిద్దరూ తండ్రితో కలసి రోహతక్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయంలో ఒక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితులందర్నీ అరెస్టు చేసేవరకూ ఎస్పీ కార్యాలయం ముందు నుంచి కదలమని అక్కాచెల్లెళ్ళు పట్టుదలగా వున్నారు.






