Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ గాంధీ బావపై ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ
posted on: Jul 17, 2025 5:28PM

వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. వాద్రాకు చెందిన కంపెనీ 2008లో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించింది. ఈ ఒప్పందంపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈడీ విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి 2018లో రాబర్ట్ వాద్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వాద్రాతో పాటు నాటి హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హుడా, రియాల్టీ సంస్థ డీఎల్ఎఫ్, ఓ ప్రాపర్టీ డీలర్ పేరును ఇందులో ప్రస్తావించారు. ఇందులో అవినీతి, ఫోర్జరీ చీటింగ్ తదితర నేరాలు నమోదయ్యాయి. మరోవైపు రాబర్ట్ వాద్రా మాట్లాడుతు రాజకీయ కుటుంబంలో కావడంతో ఈ ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన వెల్లడించారు.


.webp)
.webp)


