టైరు బరస్టై కారు బోల్తా.. నలుగురు మృతి

posted on: Aug 10, 2022 10:03AM

మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తుంటే అది నిజమేనని నమ్మక తప్పదు.

కారు టైరు బరస్ట్ కావడంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముస్కాల్ బైపాల్ కొత్తపల్లి వద్దకు రాగానే కారుటైర్ బరస్ట్ అయ్యింది.

దీంతో అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలోమరణించిన వారిలో  ఇద్దరుచిన్నారులు కూడా ఉన్నారు. ఈసంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన వారుగా గుర్తించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...