TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ ఎమ్మెల్యే కుమార్తె దుర్మరణం

Published on: Mon Mar 23, 2015 4:05PM

 

గుంటూరు జిల్లాలో బ్రాహ్మణపల్లి అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త దేవేందర్ నాథ్ కు తీవ్రగాయాలవ్వగ, అతనిని ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నుంచి పొన్నూరు వస్తున్న పద్మావతి కారు బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు సమీపంలో రేపల్లె నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.