బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో  రిషి ముందంజ‌

posted on: Jul 14, 2022 1:54PM

భార‌త సంత‌తికి చెందిన వారు విదేశాల్లో రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం ఈమ‌ధ్య వింటున్నాం. అమెరికా లో, బ్రిట‌న్‌లోనూ భార‌త సంత‌తికి చెందిన‌వారినే వారి మంత్రిమండ‌లిలో కీల‌క ప‌ద‌వుల్లోకి తీసుకోవ‌డం భార‌త్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం.  ఇపుడు తాజాగా  రిషి సునాక్ ఏకంగా బ్రిట‌న్ ప్ర‌ధాని పీఠాన్ని ఎక్క‌డానికి అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.  బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ స్థానాన్ని భర్తీ  చేసేదెవరనేది తేల్చేం దుకు ఎన్నికలు  మొదలయ్యాయి. 

జాన్స‌న్ ప్ర‌ధానిగా వున్న‌పుడు ప్రీతీ ప‌టేల్‌ను హోం సెక్ర‌ట‌రీగా, అలోక్ శ‌ర్మ‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల ప్మెంట్ సెక్ర‌ట‌రీగా, రిషి సునాక్‌ను ట్ర‌జ‌రీ ఛీఫ్ సెక్ర‌ట‌రీగా  బ్రిట‌న్ రాణి నియమించారు. అప్ప‌ట్లో ఆయ‌న కొత్త ఛాన్స‌ల‌ర్ సాజిద్ జావిద్ వ‌ద్ద ప‌నిచేశారు.  అనంత‌రం జ‌రి గిన రాజ‌కీయ ప‌రిణామాల్లో జాన్స‌న్ త‌న ప‌ద‌వి కోల్పోయారు. ఇపుడు ప్ర‌ధాని రేసులో వున్న ప్ర‌ముఖ నాయకుల‌లో  రిషి  ఒక‌రు. ప‌టేల్ యుకే సెక్యూరిటీ, ఇమిగ్రేష‌న్,  వీసా పాల‌సీల ఇన్‌ఛార్జ్‌గా వున్నారు. కాగా 39 ఏళ్ల క‌న్స‌ర్వేటివ్ పార్టీ ఎంపి రిషి ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ‌మూర్తి కుమార్తె అక్ష‌త‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ఎంబిఏ చ‌దివారు, పెట్టుబ‌డుల అంశంలో నిపుణురాలుగా సుప‌రిచితురాలు. 

భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు.  తొలి రౌండ్‌ లో  ఆయ‌న ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా అభ్యర్థులైన లిజ్‌ ట్రస్‌ (50 ఓట్లు), కేమీ బదెనోక్‌ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ (32) కూడా తొలి రౌండ్‌లో మంచి ఫలితాలనే సాధించారు. ఇదిలా ఉంటే, కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన నదీం జహావీ, జెరెమీ హంట్‌ రేసు నుంచి నిష్క్రమించారు. అలా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. 

ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారంతో ఎన్నికపై ఉత్కంఠత పెరిగిపోతుంది  గురువారం కన్జర్వేటివ్‌ ఎంపీలు తమ ఫేవ రెట్‌ అభ్యర్థులను ఎన్నుకుంటారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగులుతారు. టాప్ 2 లో ఉన్న రిషి, పెన్నీయే రేసులో ఉంటారని అంచనా. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో అత్యధిక మంది సపోర్ట్ కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్‌ 5న  ప్రధాని పదవిని  అందు కుంటారు. కాగా, ప్రధాని రేసులో నిలిచే అభ్యర్థులకు కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పలు రౌండ్లలో జరిగే ఓటింగ్‌లో కనీసం 30 ఓట్లు సాధించని అభ్యర్థులు పోటీ నుంచి ఎలిమినేట్‌ అవుతారు. ఇలా చివరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిలోంచి ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...