పాటింగ్ నిష్క్రమణం

 

Ricky Ponting retirement, Ricky Ponting, Ricky Ponting retires, Ricky Ponting  Australia

 

ఆస్ట్రేలియా కు రెండు సార్లు ప్రపంచ కప్ అందించిన రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించాడు. ఆ దేశానికి అత్యంత విజయవంత మైన కెప్టెన్ గా గుర్తింపు పొందిన పాంటింగ్ తన 17 సంవత్సరాల కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించాడు. త్వరలో పెర్త్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ పాంటింగ్ కు చివరి మ్యాచ్ కానుంది.


ప్రస్తుతం తన అట తీరు సరిగా లేదని, ఇక జట్టుకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాంటింగ్ వెల్లడించారు. దీనితో, ఆస్ట్రేలియా క్రికెట్ లో ఓ శకం ముగిసినట్లయింది.


167 టెస్టులు ఆడిన పాంటింగ్  13366 పరుగులు చేసాడు. ఇందులో 41 సెంచరీలు ఉన్నాయి.  257 అతని అత్త్యుత్తమ స్కోరు. అలాగే, 375 వన్డే లు ఆడి 13704 పరుగులు చేసాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. 17 టి 20మ్యాచ్ లు కూడా ఆడి,  401 పరుగులు చేసాడు.


పాంటింగ్ 77 టెస్ట్ మ్యాచ్ ల్లో తన దేశానికీ నాయకత్వం అందించాడు.అందులో 48 మ్యాచ్ ల్లో ఆసీస్ విజయం సాధించింది. 228 వన్డే ల్లో ఆసీస్ కు నాయకత్వం అందించిన పాంటింగ్ 164 మ్యాచ్ ల్లో జట్టుకు విజయాన్ని అందించాడు.


మూడు ప్రపంచ కప్ లు గెలిచిన జట్టులో పాంటింగ్ సభ్యుడు. 38 సంవత్సరాల పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇక అందరి కళ్ళు సచిన్ టెండూల్కర్ ఫై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్ రిటైర్మెంట్ కు సంబంధించి ఇక ఒత్తిడి అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి.