Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ సభకి వెళ్లేందుకు నాకూ అనుమతివ్వండి: రేవంత్ భార్య
posted on: Dec 4, 2018 11:28AM

ఈరోజు తెల్లవారుజామున కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ భార్య గీత బయల్దేరిన సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రేవంత్ ఎక్కడున్నాడో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌ను పోలీసులే అరెస్ట్ చేశారా? మరెవరైనా అరెస్ట్ చేశారా అని పోలీసులను ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆమె ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. సభకు అనుమతులున్నాయని చెప్పారు. అయితే సభకు వెళ్లేందుకు తనకు కూడా అనుమతినివ్వాలని ఆమె పోలీసులను కోరారు. తెల్లవారుజామున 3గంటలకు బెడ్‌రూం లోపలికొచ్చి దొంగను ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళితే చూస్తూ ఊరుకోవాలా అని రేవంత్ భార్య గీత పోలీసులను ప్రశ్నించారు.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటలుగా ఓపికగా ఉన్నామని.. కుటుంబసభ్యులతో పాటు రేవంత్ అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే తాము కొరుకుంటున్నామని గీత చెప్పారు. రేవంత్‌ను తీసుకెళ్లింది పోలీసులో కాదో తామెలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. స్థానిక పోలీసులైతే హెల్మెట్లు పెట్టుకుని ఎందుకు వస్తారన్నారు. గుర్తింపు కార్డులు, అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండా రేవంత్‌ను తీసుకెళ్లారన్నారు. తీసుకెళ్లింది పోలీసులే అయినప్పుడు ఎక్కడున్నారో చెప్పడానికి ఇబ్బందేంటని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలంతా సంయమనంతో ఉన్నారని, రేవంత్ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులుగా రేవంత్ వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమకు లేదా అని ప్రశ్నించారు.
మరోవైపు.. కోస్గిలో టీఆర్ఎస్ సభను అడ్డుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటించడంతోనే ముందస్తుగా ఆయన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని వివరించారు. వికారాబాద్ పోలీసుల ఆధ్వర్యంలోనే రేవంత్ అరెస్ట్ జరిగిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ప్రాంతంలో పోలీసుల అదుపులో సురక్షితంగా ఉన్నారని చెప్పారు.






