చీమ‌ల పుట్ట‌లో పాములు.. తెలంగాణ‌కు గులాబీ చీడ‌.. రేవంత్ ఫైర్‌

కేసీఆర్ బ‌ర్త్‌డే నాడు అంతా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబితే.. రేవంత్‌రెడ్డి మాత్రం ఊస‌ర‌వెల్లి ఫోటో ట్వీట్ చేసి క‌ల‌క‌లం రేపారు. ఛాన్స్ దొరికిన ప్ర‌తీసారి టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను గిల్లుతూనే ఉంటారు. త‌న ఉనికిని మ‌రింత బ‌లంగా చాటుతుంటారు. అంద‌రి అటెన్ష‌న్ త‌న‌వైపు తిప్పుకుంటుంటారు. లేటెస్ట్‌గా.. టీఆర్ఎస్ 21 వ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా మ‌రోసారి కారు పార్టీని త‌న ట్వీట్‌తో తూట్లు పొడిచారు పీసీసీ చీఫ్‌. ప్లీన‌రీ ఆనందం మొత్తం ఆవిర‌య్యే విధంగా.. ఒక‌ప్పుడు కేటీఆర్‌, హ‌రీశ్‌రావులు పాత సైకిల్‌తో దిగిన ఫోటోను జ‌త చేసి మ‌రింత అగ్గి రాజేశారు. 

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర‌ విమర్శలు చేశారు. ‘‘చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని, అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టింది.. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది.. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉంది.’’అంటూ ట్వీట్ చేశారు. 

ఇక ఆ ట్వీట్‌కు రేవంత్ యాడ్ చేసిన పాత ఫోటో చూస్తే.. ఆ డొక్కు సైకిల్ ముందు కేటీఆర్‌, హ‌రీశ్‌లు కూర్చొని ఉన్న సీన్.. ఒక‌ప్ప‌టి వారి ఆర్థిక ప‌రిస్థితి, ఇప్ప‌టి సంప‌న్న స్థితిని.. పోల్చి చూపేలా ఉంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu