Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ని పాతరేస్తాం... రేవంత్...
posted on: Apr 17, 2015 9:48AM

కేసీఆర్ జూరాల - పాకాల అంటే ఆయన్ని పాలమూరు జిల్లాలోనే పాతరేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్, జడ్చర్ల తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌కి ఈ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కేసీఆర్ మీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ బిడ్డల శవాల మీద నిల్చుని గద్దెనెక్కిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన కుటుంబ సభ్యులకే రాజకీయ కొలువులు తెచ్చుకున్నాడు. ఆయన ఒక రాక్షసుడు. టీఆర్ఎస్ పాలన పాలన హౌస్‌ఫుల్ - కలెక్షన్ నిల్ అన్నట్టుగా వుంది. కేసీఆర్ జూరాల - పాకాల అంటున్నాడు. అలా అంటే ఆయన్ని జిల్లాలోనే పాతరేస్తాం. పాలమూరు జిల్లా విషయంలో కేసీఆర్ కూడా వైఎస్సార్ లాగానే దుర్మార్గుడే. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు పేరుతో రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్తే కేసీఆర్ వరంగల్‌కి నీళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరికీ ఏ తేడా లేదు. కేసీఆర్ని పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపిస్తే ఆయన జిల్లాకు ఏం ఒరగబెట్టాడు? ఆస్పత్రి స్థానంలో సచివాలయం, సచివాలయం స్థానంలో ఆకాశ హర్మ్యాలు కడతామని ప్రకటించినప్పుడే కేసీఆర్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది’’ అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.






