తలసానికి మెంటల్... రేవంత్..

posted on: Mar 14, 2015 5:41PM

 

టీఆర్ఎస్ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ రెబల్‌స్టార్ రేవంత్‌రెడ్డి మరోసారి తన గళాన్ని వినిపించారు. ఇప్పుడు ఆయన తన మాజీ సహచరుడు, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద విరుచుకుపడ్డారు. తలసానికి మతి భ్రమించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సనత్‌నగర్ ఉప ఎన్నికలలో తలసానిని ఓడిస్తామని ఆయన చెప్పారు. అలాగే ఎమ్మెల్సీల ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనాలను ఆశించిన మేర పెంచలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...