TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ క్యాబేజీలు హరీశ్ రావు వాడుతున్నాడంట..!

Published on: Tue Feb 9, 2016 12:00PM

తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్ లో పలు రకాలైన కూరగాయలు పండిస్తారు. అందులో క్యాబేజీలు కూడా పండిస్తారు. అయితే ఆయన పండించిన క్యాబేజీలను కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు ఎక్కువగా ఉపయోగిస్తున్నారంట. అది ఎలాగంటారా.. ప్రజల చెవుల్లో పెట్టడానికి. ఇంతకీ ఈ మాటలు ఎవరన్నారనుకుంటున్నారా.. ఇంకెవరూ..టీడీపీ ఫైర్ బ్రాండ్.. రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడే ఇలాంటి మాటలను పేల్చగలడూ. టీఆర్ఎస్ విషయంలో అయితే రేవంత్ కు మాటలు అలా వచ్చేస్తుంటాయంతే. ఇంతకీ సంగతేంటంటే.. నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. తమ అభ్యర్ధి తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి..కేసీఆర్‌ ఫ్యామిలీపై మళ్ళీ విమర్శనాస్త్రాలు గుప్పించారు. గ్రేటర్ ఓటమితో..నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని.. గతంలో ఖేడ్ ను పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతోంద‌ని.. మంత్రి హరీష్ రావు సింగూర్ ప్రాజెక్టు ఎండగట్టారని..అందుకే జిల్లాలో మంచి నీటి కరువు ఏర్పడిందని ఆరోపించారు.

అంతేకాదు అక్కడితో ఆగకుండా కేసీఆర్ పండిస్తున్న క్యాబేజీల‌ను హరీష్ రావు ఖేడ్ ప్రజల చెవిలో పెడుతున్నారని.. ఇప్పటికే కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని తేల్చిచెప్పారు..టీఆర్ఎస్ లో స్థానం లేని హరీష్ రావు నారాయణ్ ఖేడ్ ను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మరి రేవంత్ కౌంటర్లకు టీఆర్ఎస్ పార్టీ.. హరీశ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.