TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ మాటల్లో వాస్తవముంది...

Published on: Tue May 23, 2017 4:28PM

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో నియామకంపై స్పందించి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పటికే చాలా రాద్దాంతమే జరిగింది. ఇక ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించి.. ఆయన మాటలను సమర్థించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ పవన్ అన్న మాటల్లో వాస్తవముందని... ఆయన ఆవేదన సరైనదేనని చెప్పారు. ఇంకా కేసీఆర్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని పార్టీలన్నీ కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని తెలిపారు.