TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారి

Published on: Sat Mar 26, 2016 11:35AM

పఠాన్‌కోట్‌ దాడులలో పాకిస్తాన్‌ జాతీయులు పాల్గొన్నారని మన దేశం నిరూపించే సమయంలో, అనుకోని ఓ వార్త వెలుగు చూసింది. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్‌ ప్రాంతంలో, ఓ భారతీయ గూఢచారిని పట్టుకున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. కుల్‌భూషణ్‌ యాదవ్‌ అనే సదరు వ్యక్తి భారతీయ గూఢచర్య సంస్థ (RAW)కు చెందినవాడన్నది పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. భారతీయ నౌకా దళానికి చెందిన ఇతను, ప్రస్తుతం RAW తరఫున పనిచేస్తున్నాడని ఆ దేశం చెబుతోంది. బెలూచిస్తాన్‌లో స్థానికుల తిరుగుబాటుకి భారతదేశం తోడ్పడుతోందని, పాకిస్తాన్‌ ఎప్పటి నుంచో విమర్శిస్తోంది.

 

ఇప్పుడు అదే ప్రదేశంలో ఓ భారతీయ అధికారి కూడా పట్టుబడటంతో, ఆ దేశం మరింత గట్టిగా ఆరోపించేందుకు అవకాశం చిక్కింది. కానీ మన దేశం మాత్రం పాకిస్తాన్‌ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. కుల్‌భూషణ్‌ ఏనాడో నౌకా దళం నుంచి పదవీ విరమణ చేశాడనీ, అతనికి ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా కుల్‌భూషణ్‌కు ఇరాన్ దేశం తరఫున కూడా ఒక పాస్‌పోర్టు ఉందనీ, దాని సహాయంతో అతను ఇరాన్‌ సరిహద్దుల ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని అక్కడి పోలీసులు చెప్పడంతో, ఇరాన్ ప్రభుత్వాన్ని కూడా ఈ వివాదంలోకి లాగినట్లైంది.