పవన్ కళ్యాణ్ నా గురువు: రేణూ దేశాయ్
posted on Sep 1, 2014 3:20PM

పవన్ కళ్యాణ్ తనకు విడాకులు ఇచ్చినప్పటికీ రేణూ దేశాయ్‌కి పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ తగ్గినట్టుగా లేదు. ఈమధ్యకాలంలో ఆ ప్రేమ మరింతగా పెరిగినట్టు అనిపిస్తోంది. అందుకే పవన్‌కి టచ్‌లోకి రావడానికి రేణూ దేశాయ్ ప్రయత్నాలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్‌ని తన గురువుగా పేర్కొంటూ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. ‘‘సినిమా నిర్మాణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నా గురువుంది. నా జీవితంలో పవన్ కళ్యాణ్‌ని మించిన టీచర్ మరొకరు లేరు. నేను చిత్ర నిర్మాణంలో పరిపూర్ణతను సాదించడానికి సహకరించిన పవన్ కళ్యాణ్‌కి రుణపడి వుంటాను. నేను తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ట్రైలర్ని వాస్తవానికి ఆగస్టు 26న విడుదల చేయాలి. అయితే అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. ఆరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం. నాకు సినిమా మేకింగ్ విద్యని నేర్పిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు నా సినిమా ట్రైలర్ విడుదల విడుదల చేయడం భతవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను’’ అన్నారు.