Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో విడుదల
posted on: May 3, 2024 12:42PM
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్ రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా దీన్ని తయారు చేశామని వివరించారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు.
మేనిఫెస్టోలో హామీలు ఇవే..
– హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
– హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టు
– కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం
– హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు
– ఏపీలో కలిపిన 5 గ్రామాలు మళ్లీ తెలంగాణకు తీసుకొస్తాం
– పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా
– హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం
– రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం
– నాలుగు కొత్త సైనిక్ స్కూళ్లు
– కేంద్రీయ విద్యాలయాల రెట్టింపు
– నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
– రాష్ట్రానికి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం
– ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో వైద్య పరిశోధన సంస్థ
– నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ
– రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్ టీ)
– తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ ఈఆర్) ఏర్పాటు
– సర్పంచులకు నేరుగా కేంద్రం నిధులు
– ప్రతి ఇంటికీ సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ
– హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఐటీ, పారిశ్రామిక కారిడార్
– హైదరాబాద్ – నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్
– హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
– అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం
– సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా






