TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్స, బండ్ల గణేష్ బంధంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు

Published on: Thu May 10, 2012 11:07AM

పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, కమెడియన్ గా సినీజీవితం ప్రారంభించి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, ఆజాద్, వాయలార్ రవికి ఫిర్యాదులు పంపించినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ తన అక్రమార్జనలతో బండ్ల గణేష్ ద్వారా సినిమాలు తీయిన్చారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 

 

సినిమాలు తీయటం తప్పుకాదని అయితే, అక్రమంగా ఆర్జించిన డబ్బుతో బొత్సా సత్యనారాయణ సినిమాలు తీస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బండ్ల గణేష్, బొత్స సత్యనారాయణ పేరు చెప్పుకొని అనేక అక్రమాలకూ పాల్పడ్డాడని, తాను హత్య చేసినా బొత్స పెద్ద మనస్సుతో తనను క్షమిస్తారని బండ్ల గణేష్ ఇటీవల ఒక సమావేశంలో బహిరంగంగానే ప్రకటించారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. బొత్స కూడా గణేష్ తో తనకున్న అనుబంధాన్ని దాచుకోవటానికి ఏమీ ప్రయత్నించలేదు.

 

 

బొత్సా నిర్వాకం వల్ల పార్టీ పరువు బజారున పడుతోందని కొందరు కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి పంపించిన పంపించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బొత్స ఇమేజ్ ఇప్పటికే దారుణంగా దెబ్బతింది. మద్యం మాఫియాతో ఆయనకు ఉన్న లింకులను ఎసిబి బయటపెట్టడం, ఆ పని చేయించింది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని బొత్స భావించటంతో వీరిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. అధిస్థానం వీరిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చిన రెండు రోజులకే బొత్సపై మళ్ళీ ఆరోపణలు రావటం విశేషం.