ఘనంగా ఎర్రన్నాయుడు అంత్యక్రియలు
posted on Nov 3, 2012 2:22PM

టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో శనివారం ఉదయం పూర్తయ్యాయి. ఎర్రనాయుడు కుమారుడు ఆయన చితికి నిప్పుపెట్టారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ప్రియనేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడు పార్థివదేహం వద్ద పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
అంతిమ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, యనమల రామకృష్ణుడు, నామా నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి, వల్లభనేని వంశీ, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, మంత్రులు బాలరాజు, శత్రుచర్ల విజయరామ రాజు, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు.