Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జాతకాల పిచ్చికి కూతురు బలి
posted on: Aug 21, 2012 6:53PM
జాతకాలమీద పిచ్చినమ్మకం ప్రాణాలుకూడా తీస్తోంది. పుట్టిన బిడ్డ జాతకం బాలేదని జ్యోతిష్కుడు చెబితే చేజేతులా కన్నపిల్లల్నికూడా చంపుకుంటున్నారు. కర్
నాటకలోని త్యామగొండ్లు గ్రామంలో జరిగిన ఇలాంటి ఓ దారుణం కలకలం రేపింది. పుట్టిన బిడ్డ జాతకం బాగోలేదు కనుక రెండు నెలల్లో చనిపోతావని ఓ పసికూన తండ్రికి శాస్త్రం సగం తెలిసిన జ్యోతిష్కుడొకడు చెవిలో ఊదాడు. అది విన్నదగ్గర్నుంచీ కర్కశహృదయంగల తండ్రికి నిద్రపట్టలేదు. ఏదో ఒకటి చేసి పిల్ల ప్రాణాలు తీయాలనుకున్నాడు. అనుకున్నది సాధించాడు. పాలల్లో విషం కలిపి ప్రేమగా కన్నకూతురికి పట్టేశాడు. తండ్రి ప్రేమతో మామూలు పాలే పడుతున్నాడులే అనుకుంది కన్నతల్లి. తెల్లారేసరికి నోట్లోంచి నురగలు కక్కుతూ కనిపించిన పాపను తల్లి ఆసుపత్రికి మోసుకెళ్లింది. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కసాయి మొగుడు కన్నకూతురికి పాలుపట్టిన విషయం గుర్తొచ్చిన తల్లి.. వాణ్ణి పోలీసులకు పట్టించింది.


.png)
.png)


