Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంత్రిగారికి తిక్క తలకెక్కింది
posted on: Aug 21, 2012 6:48PM
అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంవల్ల రైతులకు మేలే జరుగుతోందట. ఈ మాటలు చెప్పింది అల్లాటప్పా నేతకాదు. గల్లీల్లో తిరిగే సిల్లీ నాయకుడు కూడా కాదు. ఘనత వహించిన కేంద్రమంత్రి కూసిన కారుకూతలివి. ఈ మాటలు విన్న జనం.. కాంగ్రెస్ లో సీనియర్లకి ఎట్టాపడితే అట్టా మాట్టాడే జబ్బుండడం మామూలేలే అని సరిపెట్టుకోలేకపోతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కష్టపడో, నష్టపడో కోట్లాదిమంది జనం కడుపులు నింపుతున్న రైతుల కడుపులు మంత్రిగారి మాటలకు రగిలిపోతున్నాయి. వర్షాలుపడక, కాలం కలిసిరాక, అప్పులపాలై తిప్పలు పడుతున్న రైతన్నలకు బేణీ ప్రసాద్ మాటలు తూటాల్లా తగిలాయి. తిక్క తలకెక్కి రైతుల్ని పూచికపుల్లలా తీసిపారేస్తూ మాట్లాడిన మంత్రిగారు అధిష్ఠానం అనుగ్రహంకోసం గట్టిగానే పాకులాడుతున్నారు. 2014 ఎన్నికల నాటికి ప్రథాన కుర్చీకి ప్రథానపోటీ రాహుల్ గాంధీ, నరేంద్రమోడీల మధ్యే ఉంటుందని జోస్యంకూడా చెప్పి యువనేతపట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు.


.png)
.png)


