చిత్తూరులో రోడ్డెక్కిన రవాణా శాఖ

posted on: Aug 11, 2012 10:35AM

రవాణాశాఖ నిజంగానే రోడ్డెక్కింది. దీంతో మంచి ఫలితాలను సాధించి మిగిలిన జిల్లాలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది. చిత్తూరు రవాణాశాఖాధికారులు త్రైమాసికపన్ను చెల్లించని 20వేల వాహనదారులకు నోటీసులు జారీ చేసింది. ఇంత ఎక్కువమందికి నోటీసులు జారీ చేసిన కార్యాలయం మన రాష్ట్రంలోనే లేదని రవాణాశాఖ రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటి దాకా వాహనాల తనిఖీల ద్వారా 20లక్షల రూపాయలు వసూలు చేశామని డిటిసి ప్రకటించారు.


 

త్రైమాసికపన్ను చెల్లించని 280 వాహనాలు సీజ్‌ చేశారు. వాహనతనిఖీల్లో రవాణాశాఖ కార్యాలయంలో పని చేసే 22మంది పాల్గొన్నారు. తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, పుంగనూరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించామని డిటిసి విశదీకరించారు. తమ సిబ్బంది సహకారంతో మరిన్ని ఫలితాలు సాథిస్తామని ఆయన ‘తెలుగువన్‌.కామ్‌’కు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కండిషనులో లేని వాహనాలను రోడ్డుపైకి అనుమతించటం లేదన్నారు. అలానే రవాణాధరఖాస్తులకు కార్యాలయంలో సిబ్బంది పూర్తి సహాయసహకారాలందిస్తున్నారన్నారు. సిబ్బంది సహకారంతోనే రెవెన్యూ ఇంకా పెంచేందుకు కృషి చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. అలానే స్కూలుబస్సులు, ప్రైవేటు బస్సుల గురించి  కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...