Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రంలో ఆహార సంక్షోభం రూ.60కి చేరనున్న కిలో బియ్యం?
posted on: Aug 11, 2012 10:28AM
అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం వరిపంట దిగుబడి గణనీయంగా తగ్గబోతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 26.48 లక్షల హెక్టార్ల భూముల్లో పంటలు వేయాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 9.40 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆహార ధాన్యాల రేట్లు మరింత పెరగడం ఖాయమని బియ్యం ధర కిలో అరవై రూపాయలకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కేవలం 13 జిల్లాలో మాత్రమే వర్షం కురిసింది.మిగతా జిల్లాలో 3 నుండి 31 శాతం వరకు మాత్రమే వర్షంపడిరదని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.
అనంతపురంలో ఎప్పటిలాగానే కరువు పరిస్తితులు నెలకొన్నాయి. ఆ జిల్లాలో 31 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. నిజామాబాద్,నల్గొండ, విశాఖపట్టణం, కర్నూలులో వరుసగా 24,21,21,3 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. జూన్ మొదటి వారంలో సాగుచెయ్యవలసిన నారుమళ్లను సరైన వర్షపాతం లేకుపోవడంతో రైతులు సాగుచేయలేక పోయారు. ఈ పరిస్థితులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, వ్యవసాయమంత్రి కన్నా లక్ష్మీనారాయణ,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి మహీధర్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్షించారు.
అంతే కాక సాగుకాలం పూర్తవడంతో తృణధాన్యాల సాగుచేపట్టాల్సిందిగా రైతుల్ని కోరాలని కూడా కలెక్టర్లకు సూచించారు. ప్రకాశం, విజయనగరం, విశాఖ పట్టణాలలోకూడా ఇదే పద్దతులు కొనసాగించాలని కలెక్టర్లను మంత్రులు కోరారు. నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు అనుకున్నంతగా వర్షాలను ఇవ్వకపోవడంతో రైతులు డీలాపడ్డారు. రాష్ట్రాన్ని దుర్భిక్ష ప్రాంతంగా ప్రకటింపచేసి కేంద్రంనుండి నిధులు తేవల్సిందేనని రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.


.jpeg)



