జగన్‌ గూటిలోకి ఇద్దరు మాజీ మంత్రులు, ముగ్గురు ఎంఎల్‌ఏలు?

posted on: Aug 10, 2012 8:34AM

గుంటూరు జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ప్రాభవం కోల్పోతోంది. ఈ జిల్లాలో మాజీ మంత్రులిద్దరు, ముగ్గురు ఎంఎల్‌ఏలు వైసిపిలోకి వెళుతారన్న వార్తలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లాలోని నాయకులంతా వైసిపి బాట పట్టడంతో చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారు.పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు బిసిలకు కెటాయించి, ఉచిత కరెంటుతో రైతుల సంక్షేమానికి పాటుపడతామని ఆయన ప్రకటించినా నాయకుల వలసలు ఆగడం లేదు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపలేకపోతున్నారు.

 

 

ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షపార్టీగా ఎండకట్టలేకపోవడం తెలుగుదేశం పార్టీకి ప్రధాన అవరోధంగా మారింది. చంద్రబాబునాయుడు ఎన్ని జనాకర్షక పధకాలు మొదలు పెట్టినప్పటికీ వాటిని కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకత్వం గుంటూరు జిల్లాలో లేదు. క్రియాశీలకంగా పనిచేయగలిగిన కార్యకర్తలను, నాయకులను సమీకరించడంలో చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తూ ఆలస్యం చేస్తున్నారనేది జిల్లా నాయకుల ప్రధాన ఆరోపణ. ఇకనైనా క్రిందిస్ధాయినుండి క్యేడర్‌ను పెంచుకుంటూ కార్యకర్తల మనోభావాలను గుర్తించి పల్లెల్లోనూ పట్టుసాదించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం అధిపతి పార్టీని ప్రక్షాళన చేసి, అంకిత భావంతో పనిచేసి పార్టీకి పూర్వవైభవాన్ని సంతరింపచేసే నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలుగుదేశం అభిమానులు కోరుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...