ఆజాద్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనానికి అద్దెకట్టిన పీసిసి?

posted on: Aug 9, 2012 1:06PM

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ ప్రచారం చేసేందుకు వచ్చినప్పుడు వినియోగించిన బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనానికి పీసిసి పోలీసు శాఖకు అద్దె చెల్లించింది. వాస్తవానికి అథికారపార్టీకి ఎన్నికల్లో ఉపయోగించిన వాహనాల అద్దె బిల్లు వేయకుండా పోలీసులే పలు జిల్లాల్లో మేనేజ్‌ చేసేశారు. కానీ, తిరుపతి పోలీసులు దానికి భిన్నంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఆజాద్‌ పర్యటనను రికార్డు చేసి తమశాఖ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనానికి అయిన ఖర్చును, అద్దెను కలిపి బిల్లు తయారు చేశారు.

 

 

ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీల నేతల వాహనాల ఖర్చు ఆ పార్టీలే భరించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారమే అర్బన్‌ జిల్లా ఎస్పీ ప్రభాకరరావు గత నెల 11న పీసిసికి నోటీసు పంపించారు. ఆజాద్‌ పర్యటనలో మొత్తం 60కిలోమీటర్లు తిరిగారని, దానికి ఆయిల్‌, అద్దె ఖర్చుల కింద రూ.930 చెల్లించాలని ప్రభాకరరావు పీసిసిని కోరారు. దీనికి స్పందించిన పీసిసి ఈ బిల్లు చెల్లించాలని పీసిసి కార్యదర్శి ఎంఆర్‌సి రెడ్డిని కోరింది. అదీ నిబంధనల ప్రకారం చెలానా రూపంలో చెల్లించాలని సూచించింది. దీంతో పీసిసి తరుపున కార్యదర్శి ఎంఆర్‌సి రెడ్డి అర్బన్‌జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి చలానాను అందజేశారు. నిబంధనల ప్రకారం రశీదు కూడా తీసుకున్నారు. దీంతో ఆజాద్‌ పర్యటనకు పద్దతి ప్రకారం ఖర్చు చేసినట్లు అయిందని రెడ్డి, అర్బన్‌ జిల్లా ఎస్పీతో అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...