Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశంలోని 12 రాష్ట్రాల కంటే సీమప్రత్యేకరాష్ట్రమే పెద్దదా?
posted on: Aug 9, 2012 12:03PM
దేశంలోని 12 రాష్ట్రాల కంటే రాయలసీమ ప్రత్యేకరాష్ట్రమే పెద్దదా? ఈ ప్రశ్న మేథావులను సైతం ఆలోచింపజేసేలా ఉంది. ఒక్క రాయలసీమను ప్రత్యేకరాష్ట్రం చేస్తే దానికి అవసరమైన జిల్లాలు కూడా ఏమేమి ఉండాలో అన్న అంశం గురించి కూడా రాయలసీమపరిరక్షణ సమితి క్షుణ్నంగా పరిశీలించేసింది. రాష్ట్రానికి హద్దులు, ఎల్లలు కూడా నిర్ణయించేసింది. ప్రత్యేకించి రాష్ట్రజనాభా వివరాలను కూడా సేకరించి పూర్తిస్థాయి నివేదికతో పరిరక్షణసమితి సన్నద్థంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అంశం చేరటానికే ఏళ్లు పట్టేస్తే అస్సలు కష్టపడాల్సిన పని లేకుండా పూర్తివివరాలతో తాము పోరాడుతున్నామని పరిరక్షణ సమితి ప్రకటిస్తోంది.
మాకు తెలంగాణాను కలపాల్సిన పనేలేదని పరిరక్షణ సమితి ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటున్నారు. తమ సీమ రాష్ట్రం 60వేల చదరపు కిలోమీటర్ల పరిథిలో ఏర్పాటు చేయవచ్చని వివరిస్తున్నారు. దేశంలోని 12రాష్ట్రాల కంటే సీమరాష్ట్రమే పెద్దదంటున్నారు. తమ రాష్ట్రం కోసం వేరే ప్రాంతాల్లోని జిల్లాలు కలుపుకోవాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు. తమ రాయలసీమలో ఉన్న నంద్యాల, రాజంపేట, హిందుపురం, తిరుపతి, ప్రొద్దుటూరులను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించేస్తే సరిపోతుందని బైర్రెడ్డి చెప్పుకొస్తున్నారు. అసలు ఇంతలా సీమరాష్ట్రం గురించి కసరత్తులు చేస్తున్నారు సరే! మరి కేంద్రం దృష్టికి ఈ వివరాలు వెళ్లాయా అంటే మీడియా ఉంది కదా అని తప్పించుకుంటున్నారు. ఏమైనా సీమరాష్ట్రం ఎలా ఉండాలో కలలు కంటున్న బైర్రెడ్డి తమ సీమకే చెందిన తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబును ఒప్పించగలరా? అన్న సవాల్‌ను స్వీకరించాలని కాంగ్రెస్ పెద్దలు కోరుతున్నారు. తెలంగాణా ప్రాంతమే భౌగోళికంగా మార్చటం కుదరక ఆ రాష్ట్రం గురించి ఆ ప్రాంతవాసుల కలలను కేంద్రం పట్టించుకోవటం లేదు. మరి ప్రతిపాదనలో లేని సీమరాష్ట్రం వస్తుందా? చస్తుందా అని కాంగ్రెస్ నేతలు బైర్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో మాదిరిగా ఒక ప్రాంతీయపార్టీ పెట్టుకోవటానికి బైర్రెడ్డి ఈ ప్రయత్నాలు చేస్తే పర్వాలేదు కానీ, ఖచ్చితంగా సీమ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటే కష్టమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా రాయలసీమపై బైర్రెడ్డికి ఉన్న పట్టును ఆయన విశదీకరించిన హద్దులు, కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో కనిపించదని కాంగ్రెస్ నేతలూ అంగీకరిస్తున్నారు.


.png)
.png)


