Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎథిక్స్ కమిటీనుండి శాసనసభ్యులకు నోటీసులు
posted on: Aug 6, 2012 4:30PM
రాష్ట్రంలో ఇంకా 90 మంది శాసన సభ్యులు తమ ఆస్తుల విషయాలు వెల్లడిస్తూ పత్రాలు ఇంకా పంపలేదని, శాసనసభాద్యక్షులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతానిక అందిన శాసనసభ్యుల వివరాల మేరకు శాసనసభ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అయితే శాసనసభ సభ్యులు మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టటమే తమకు తలనొప్పిగా మారిందని అఫడవిట్‌లు పంపిన వారు పంపని వారూ కూడా వాపోతున్నారు.
ఇదివరలో అయితే ఈ వివరాలు శాసనసభవరకే పరిమితమై ఉండేవన్నారు. అయితే అఫడవిట్లను తీసుకోవడం ఖచ్చింతంగా అమలు చేసేందుకు స్పీకర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వివరాలు పంపని శాసనసభ్యులకు శాసనమండలి ఎధిక్స్ కమిటీ నుండి లేఖలు పంపాల్సిందిగా కమిటీ మెంబర్సును కోరారు. దీంతో లెక్కపత్రం లేని ఆస్తులను కలిగిఉన్న శాసనసభ్యులు అసహనంగా ఉన్నారు. ఏది ఏమైనాన శాసనసభ్యుల వివరాలను పారదర్శకంగా ఉంచడం హర్షించతగ్గ పరిణామం.


.png)



