Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిన్న నిర్మాతలకు ఇక మంచి రోజులు
posted on: Aug 1, 2012 10:11AM
చిన్న నిర్మాతలకు ఇక నుండి మంచి రోజులు రానున్నాయని ఫిలిం ఛాంబర్‌లో తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్ సాధించిన ఘన విజయం చెబుతుంది. చిత్ర పరిశ్రమంతా కొందరి చేతుల్లో ఉండటం చిన్న సినిమాలకు ధియేటర్లు ఉండక పోవడం గత కొంతకాలంగా చిన్న హీరోలను, నిర్మాతలను వేధిస్తున్న సమస్య. సినిమా పరిశ్రమ అంతా గుత్తాధిపత్యం లోకి వెళ్లడంతో దిక్కుతోచని చిన్న సినిమాలు తీసే సినీ నిర్మాతలు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే వున్నారు. వీరంతా పెద్ద నిర్మాతల చేష్టలతో విసిగి వేసారిన వారే.... వారికి తమ్మారెడ్డి భరద్వాజ, దాసరి నారాయణరావు అండగా ఉండి మంచి సినిమా సినిమాలు రావాలంటే గుత్తాధిపత్యానికి తెరపడాలని సాగించిన పోరాటంలో ఫిలించాంబర్ ఎన్నికలు జరిగాయి.
అత్యధిక ఓటింగ్ చిన్న నిర్మాతలకు చెందిన తమ్మారెడ్డి ప్యానల్‌కు పోలవటం చిన్న హీరోలకు ఊరట కలిగింది. పెద్దనిర్మాతలు, పెద్ద హీరోల సినిమాలే కాకుండా ప్రేక్షకులకు చిన్న సినిమాలు కూడా వినోదానందిస్తాయని వాటిని నిరోధించటం తగదని వారు తెలిపారు. ఇకనుండి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని చిన్న హీరోలు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై సినిమాలకు సంబంధించిన అడ్యర్‌టైజ్‌మెంట్స్‌లో కూడా పెద్ద, చిన్న పత్రికలు అనే తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు ఇచ్చే దిశలో ఒకప్పటి పత్రికాధిపతి దాసరి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.


.png)
.png)


