Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రత్యేకతెలంగాణా ఓ నెరవేరని కల?
posted on: Jul 23, 2012 11:20AM
ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం అనేది ఓ నెరవేరని కలగా మిగులుతుందని నేటి రాజకీయవాతావరణం తేటతెల్లం చేస్తోంది. దేశ తొలిపౌరునిగా, భారత రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఎన్నిక తెలంగాణావాదులకు ఓ పెద్దషాక్. భారీమెజార్టీతో ఆయన గెలుపొందినందున(70శాతం) తెలంగాణా వచ్చే సమస్యే లేదని రాజకీయ మేథావులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా పొరబాటున తెలంగాణాకు అనుకూలంగా స్పందిస్తే మరో కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఖండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా అవసరమా? అన్న విషయంపై కేంద్రంలోని ఎంపీలు అందరూ ఒక్కతాటిపై లేరనేది జగమెరిగిన సత్యం.
ప్రత్యేకించి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా కేంద్రపార్టీ నిర్ణయాలకు తలొంచాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున పూర్తిస్థాయి అథికారాన్ని పొందేందుకు సిద్ధమవటం వల్ల కాంగ్రెస్ ఆ హడావుడిలో బిజీగా ఉండిపోతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు ముగియకుండానే రాహుల్‌గాంథీ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా పూర్తిస్థాయిలో పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఇప్పటికే ఆయన నేతలతో అన్నిరాష్ట్రాల్లోని పరిస్థితులూ తెలుసుకుని తాను ప్రధాని అయితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అన్న విషయం పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ రాకతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాహుల్‌గాంధీ రాజకీయరంగ ప్రవేశం చేస్తే తాను మద్దతు ఇస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటకు ఇప్పటికీ తాము కట్టుబడి ఉంటామని వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఇటీవల ఢల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో అన్నారట.
సో! దీని వల్ల 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాంధీ అయితే వైకాపా మద్దతు ఇవ్వటం ఖాయమని తేలుతోంది. ఈ నేపథ్యంలో తెరాస కోరుకున్న ప్రత్యేకరాష్ట్రం అసలు సాధ్యమవదు. అంతేకాకుండా వైకాపాను తెలంగాణాప్రాంతంలో పట్టుపెంచుకోమని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే ఒకవేళ జగన్ విడుదలయ్యాక పార్టీ కొనసాగించినా తెలంగాణా ప్రాంతం నుంచి వైకాపా మద్దతు కాంగ్రెస్ కోరుకుంటోంది. 2012 పరకాల ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని కొండా సురేఖ ఇచ్చిన గట్టిపోటీ కాంగ్రెస్ పార్టీని ఆకట్టుకుంది. ప్రధాని కూడా ఇదే విషయాన్ని గమనించి తెరాసకు ప్రత్యామ్నాయంగా వైకాపా చాపకింద నీరులా విస్తరించాలని సూచించారట. అందుకే విజయమ్మ ఢల్లీ నుంచి వచ్చాక తన కుమారుడితో చర్చలు జరిపి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతు నిరసనకార్యక్రమం రూపొందించింది. అలానే జగన్ కూడా మొన్నటి వరకూ టిఆర్‌ఎస్ అథినేత కెసీఆర్‌తో రహస్య మంతనాలు కొనసాగించి ఇప్పుడు అసలు ఆయనతో మాట్లాడేందుకూ ఇష్టపడటం లేదట.
తెలంగాణా గురించి చర్చలు నిర్వహించే పరిస్థితుల్లో కాంగ్రెస్ అథిష్టానం ఇప్పుడు లేదు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత తెలంగాణా గురించి ప్రతిపాదిద్దామని కెసీఆర్ భావించారు. ఈలోపే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం తెరపైకి రావటంతో కాంగ్రెస్ సీనియర్లు ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నాటి రాజీవ్‌గాంధీతో సమానంగా రాహుల్‌కు క్రేజ్ పెంచేపనిలో కాంగ్రెస్ నేతలు మునిగిపోవటంతో తెలంగాణా ఇప్పట్లో రానట్లే అని మేథావులు సైతం తేలుస్తున్నారు. అలా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని కెసీఆర్ సంప్రదించకుండా తెలంగాణాలోనే కొత్తచిచ్చు రగులుతోంది. వైకాపా, తెరాస తెలంగాణా ప్రాంతంలో నిరసనల ద్వారా బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈ ప్రదర్శనల హోరు తరువాత కాంగ్రెస్ ప్రకటించే స్థానికఎన్నికలతో 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం పోస్టుపోన్ అయింది. దీంతో ఆ ఎన్నికలే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి రిఫరెండం అవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర డిమాండు 2014 అజెండా అంశం కాక తప్పదంటున్నారు పరిశీలకులు. మరి కెసీఆర్ మరో జోస్యం సక్సెస్ అయిందా? లేక ఫెయిల్‌ను ఎలా కవర్ చేస్తారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చాయి. కాలమే దీనికి సమాధానాలు ఇవ్వాలి మరి.
తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని పిసీసీ అథ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా వాదులకు ప్రత్యేకరాష్ట్ర ఆశలు పెంచాయి. అసలు ఈ వ్యాఖ్యలే యాథృచ్ఛికమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. తెలంగాణా కలిసుండాలా? విడిపోవాలా? అన్నది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉందని, అది బొత్సాకు ఆపాదించొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో తెలంగాణా అంశం ఒక్కదానిపై చర్చించటం బాగోలేదన్నట్లు పాలడుగు వ్యాఖ్యలున్నాయి. ఇంకా కాంగ్రెస్ అథిష్టానం ప్రత్యేక తెలంగాణా అంశంపై ఒక అభిప్రాయానికి రాలేదని బొత్సా, పాలడుగు ప్రకటనలను బట్టి అర్థం చేసుకోవాలి. ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఇలాంటి వైరుథ్య ప్రకటనలు వెలువడేది కాదు.


.jpeg)



