అధికారులను వణికిస్తున్న సమాచార హక్కు చట్టం!

posted on: Jul 18, 2012 8:14PM

right to information act, state information commission, information commissioner madhukar raja, nellore si penalized under rti act, east godawari district rti case, rajahmundry municipality rti case, nellore si rti case, vizianagaram endowments rti caseసమాచార హక్కు చట్టం పదునెక్కింది. నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురికి రాష్ట్ర సమాచార కమిషన్‌ జరిమానా విధించింది. రాష్ట్ర సమాచార కమిషనర్‌ మధుకర్‌రాజ్‌ 2009`10లో సమాచారం ఇవ్వలేదని ఏడుగురు పిఐఓలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపారు. ఏడుగురు పిఐఓలూ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. ఈ జరిమానా కూడా తమ జీతాల్లోంచి కట్టాలని వారికి ఆదేశాలు ఇచ్చారు.

2009లో దేవాదాయశాఖ విజయనగరం జిల్లా అసిస్టెంట్‌ కమిషనరుగా పని చేసిన అథికారికి 25వేల రూపాయలు జరిమానా విధించారు. నెల్లూరు ఐదోటౌన్‌, గూడూరు వన్‌టౌన్‌, గూడూరు ఎస్‌ఐ, హైదరాబాద్‌ వైద్యవిధానపరిషత్తు జాయింట్‌డైరెక్టర్‌ తదితరులకు పదివేల రూపాయల జరిమానా విధించారు.  రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీకమిషనరుకు వెయ్యిరుపాయల జరిమానా విధించారు. ఇలా మొత్తం ఏడుగురికి ఒక్కసారే పెనాల్టీలు విధించటం రాష్ట్రంలో సంచలనమైంది. సకాలంలో సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తే చర్యలుంటాయని చెప్పేందుకు హెచ్చరికగా కమిషనరు పెనాల్టీలు విధించారు. జరిమానా చెల్లించాల్సిన వారిలో నలుగురు పిఐఓలు నెల్లూరు జిల్లావారు కావటం గమనార్హం. అందుకే ఆ జిల్లాలో ఈ వార్త పోలీసుశాఖను కదిలించింది. సమాచారం కోరే కేసులను అజాగ్రత్తగా చూడొద్దని ఎస్‌ఐలు తమ కింది సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరు సమాచారం కోరినా ముందుగా తన దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఐలు తమ సిబ్బందిని కోరుతున్నారు.  అవసరమైతే దీనికి ప్రత్యేకంగా స్టేషనులో ఒకరికి బాధ్యత అప్పగిద్దామని కూడా వారు నిర్ణయం తీసుకున్నారట.

అలానే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీకమిషనరుకు వెయ్యిరూపాయలు పెనాల్టీ విధించటం కార్పొరేషనులో పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై జిల్లా కేంద్రమైన కాకినాడలోనూ నగరపాలక అధికారులు చర్చించారు. పైగా, ఇప్పటి దాకా పెండిరగ్‌లో ఉన్న సమాచారహక్కు కేసుల గురించి తమ సిబ్బందిని పిలిచి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనరు వి.రవికుమార్‌ ప్రశ్నించారట. మొత్తం మీద నగరపాలక సంస్థల్లోనూ, పోలీసుశాఖలోనూ ఈ ఉత్తర్వులు స్పందన తీసుకువచ్చాయి. సమాచార హక్కు చట్టం పదును తెలుసుకునేందుకు కూడా ఈ ఉత్తర్వులు దోహదపడ్డాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...