ఆరు నెలల్లో కిరణ్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా?

posted on: Jul 18, 2012 3:25PM

kiran kumar reddy, CM kiran kumar reddy,  kiran kumar reddy congress, congress APకాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండబోదని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ తెలంగాణా ఇచ్చే అంశాన్ని పక్కనబెట్టేయాలని గతంలోనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో జగన్‌ పార్టీ ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నది. దీనిని అధిగమించడం కాంగ్రెస్‌కు సాధ్యమయ్యే పనిలా లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నిమ్మకు నీరెత్తినట్లు నడుపుతున్నారు. మరో ముఖ్యమంత్రిని మార్చినందువల్ల ప్రయోజనం లేదని, ఎలాగోలా ఇలాగే నడిపించే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉన్నది.

 

 

జగన్‌కు బెయిల్‌ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించవచ్చని, డిసెంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో జరగబోయే నష్టాన్ని కర్ణాటక ద్వారా భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వంపై ప్రజలకు వెగటు కలిగిందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పడిపోతే కాంగ్రెస్‌ కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసి రెండు రాష్ట్రాల్లో ఒకేసారి మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

google-ad-img
    Related Sigment News
    • Loading...