బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మృతి

posted on: Jul 18, 2012 3:04PM

బాలీవుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న అలనాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా బుధవారం ఉదయం తమ స్వగృహంలోనే కన్ను మూశారు. ముంబైలోని బాంద్రాలో సొంత ఇంటిలో జీవిస్తున్న ఖన్నా కొంతకాలంగా అస్వస్థతకు గురవుతున్నారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మళ్లీ స్వస్థత చేకూరడంతో ఆయనను ఇంటికి తిరిగివచ్చారు. తిరిగి మంగళవారం నాడు ఆయన మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఇంటికే వచ్చి ఆయనకు చికిత్స చేశారు. కాని చివరికి బుధవారం మధ్యాహ్నం అంతిమ శ్వాస విడిచారు. రాజేశ్ ఖన్నా 1966లో హిందీ సినిమా రంగంలో ప్రవేశించారు. రాజేశ్ ఖన్నా 1991లో రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కాంగ్రెస్ ఎం.పి.గా ఎన్నికయ్యారు 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...