హైదరాబాద్ కి వచ్చిన నరహంతకుడు ఆంటోనీ

posted on: Jul 18, 2012 12:44PM

కేరళ రాష్ట్రానికి చెందిన నరహంతకుడు ఆంటోనీ కేరళ, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆంటోని హైదరాబాదులో తిరుగుతున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడి పోలీసులకు సమాచారమందించారు. ఆంటోనీ కోసం ఇక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజధాని శివార్లలో రెండు పోలీసు బృందాలు ఆంటోని కోసం గాలిస్తున్నాయి. దీంతో అతనిని పట్టుకునేందుకు అక్కడి నుండి ప్రత్యేక పోలీసులు వచ్చారు. తిరుపతి క్రైం పోలీసులు కూడా కేరళ పోలీసులకు ఆంటోనీని పట్టుకునేందుకు సహకారం అందిస్తున్నారు.

 

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నరహంతకుడిగా చలామణి అవుతోన్న ఆంటోనిపై 20కి పైగా కేసులున్నాయి. గత నెల 25న కేరళలోని పొల్లం జిల్లా యందువారిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఎస్‌ఐ జోయిని కత్తితో పొడవటమే కాకుండా పోలీస్‌ డ్రైవర్‌ మునియన్‌ పిళ్లైను దారుణంగా హతమార్చాడు. అంతే కాకుండా సైకో ఆంటోని 17 మందిని వివాహం చేసుకున్నట్లు ఆధారాలున్నాయని పోలీసులు చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...