కిరణ్‌ దేశంలోనే అత్యంత అప్రయోజక ముఖ్యమంత్రా?

posted on: Jul 17, 2012 8:06PM

kiran kumar reddy, ap chief minister kiran kumar reddy, chittoor mp shivaprasad, minister shailajanath, indiramma bata kiran kumar, kiran kumar helicopter, chittoor district development kiran kumarకిరణ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంతోకాలం కొనసాగలేరని, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తెలిపారు. దేశం మొత్తంమీద ఇలాంటి అప్రయోజక ముఖ్యమంత్రి లేరని, ఇంటిబాట పడతానన్న బెంగతోనే ఇందిరమ్మ బాట పట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

హెలికాప్టర్‌లో తిరుగేందుకే ఇలాంటి యాత్రలు నిర్వహిస్తున్నారన్నారు. చిత్తూరులో సంవత్సరం క్రిందట జరిగిన శ్రీకృష్ట దేవరాయ శతాబ్డి ఉత్సవాల్లో జిల్లా అభివృద్దికి ఆరువేల కోట్లు ఇస్తామన్న కిరణ్‌ ఇంతవరకు ఆరు రూపాయలు కూడా విదల్చలేదన్నారు. తిరుమల అన్నదాన కార్యక్రమంలో పాయసం బదులు మామిడి రసం పెడితే  మమిడి రైతులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు మంత్రి శైలజానాధ్‌ చెప్పులు కొంటారని చెప్పారని, ఆయన కొనకపోతే తన నియోజకవర్గ విద్యార్థులకు తనే చెప్పులు కొంటానని ఎంపీ శివప్రసాద్‌ తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...