Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మన ఎం.పీ.లు పైరవీలకే పరిమితమా?
posted on: Jul 17, 2012 7:25PM
మన పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారనుకుంటున్నారు....కేంద్రమంత్రులు ఏలా ఉండాలనుకుంటున్నారు..వారు సామాన్య ప్రజానీకాన్ని గురించి చర్చించి మెరుగైన సమాజం కోసం పాటుపడేవాళ్లగా ఉండాలనుకుంటుంన్నాం . కాని వారు మాత్రం సౌకర్యాలను అనుభవిస్తూ ప్రజలగురించి మాత్రం పూర్తిగా మర్చిపోయారనటానికి బోల్డన్ని ఉదాహరణలు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రాంతీయ వివక్షను ప్రక్కనపెట్టి ప్రాజెక్టులుగాని, విద్యుత్, గ్యాస్‌లపై అధనంగా మన రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి కాని అడిగిన పాపాన పోలేదు.
రిలయన్సు గ్యాస్ డ్రిల్లింగ్ జరుపుతున్న కె.జి.బేసిన్ ప్రాంతానికి చెందిన ఎంపి ఈ మద్య మాట్లాడుతూ ఎందుకు గ్యాస్ మనకు ఇవ్వవలసినదానికన్నా తక్కువ ఇస్తున్నారు మీరు ఎందువల్ల తేలేక పోతున్నారంటే వారు డ్రిల్లింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకోలేదని, ఇప్పుడు రిలయన్స్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా తమను వత్తిడికి గురి చేస్తున్నందువల్లే పార్లమెంటులోఅడగలేక పోతున్నామన్నారు. యుపిఎ గవర్నమెంటులో అందరికన్నా ఎక్కువ మంది ఎం.పి.లు ఆంధ్రప్రదేశ్‌నుండి వెళ్లినా వివక్షకు గురి అవుతున్నాం. నగర అభివృద్దికోసం కేంద్రం తలపెట్టిన జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణానికి కెటాయింపులలోనూ వివక్షకు గురిఅయ్యాం. బెంగుళూరు, ముంబై, చెన్నై, కలకత్తాలు మనకు రెట్టింపు మొత్తాలు పొందాయి.
నగరాల్లో మంచినీటి సరఫరా, భూగర్బడ్రైనేజీ వర్షపునీటి పైపులైన్ల నిర్మాణానికి మన రాష్ట్రంనుండి 2,166 కోట్లవిలువైన ప్రతిపాధనలు పంపినా 3 సంవత్సరాలనుండి వాటికి మోక్షం రాలేదు. పోలవరం, చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఒక్కరు కూడా ప్రయత్నించడంలేదు. రైళ్లసంగతి అలాగేవుంది. మనకు ఈ సంవత్పరం 31 రైళ్లు రాష్ట్రానికి మంజూరు చేసినా ఇప్పటివరకు 12 రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వైద్య శాఖపైకూడా అదే నిర్లక్ష్యం చూపుతుంది. ట్రామాకేర్ నిధులను ఐదేళ్ళ నుంచి మంజూరు చేయించుకోలేక పోయారు. నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఆసుపత్రి ది అదే పరిస్థితి. అడుగడుగునాప్రజాధనంతో విలాసాలు ,డిల్లీలో పైరవీలు తప్ప వీరు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి.


.jpg)
.jpg)


