Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు
posted on: Jul 17, 2012 7:10PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆందోళనల సమయంలో హైకోర్టులో జరిగిన ఘటనపై వ్యవహరించిన తీరును తప్పు బడుతూ సుప్రీం కోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని అభిసంశించింది. న్యాయమూర్తులు హెల్మెట్‌లతో వచ్చి హైకోర్టులో విధులు నిర్వహించాల్సిన పరిస్థితిని తీసుకోస్తారా అని కోర్టు ఆగ్రహించింది. గొడవలు చేసిన న్యాయవాదులను గుర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది.
ఇప్పటి వరకు ఆందోళనలకు పాల్పడిన ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని, బార్ కౌన్సిల్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఆందోళనలు చేసిన వారిని బార్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. న్యాయస్థానాల్లో రౌడీయిజం, గుండాయిజం లాంటి చర్యలను ప్రభుత్వం సమర్థిస్తుందా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదుల లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇవ్వగలరా అని అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్లో అనుకూలంగా తీర్పు రాకుంటే, న్యాయమూర్తులపైన కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.


.png)
.jpg)


