ఎన్టీఆర్ ఆఫీసుపై దాడి: హరికృష్ణ వివరణ

posted on: Jul 12, 2012 12:32PM

ఫిలింనగర్‌లోని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈదాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కార్యాలయం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా బాద్షా సినిమా షూటింగ్ నిమిత్తం జూ.ఎన్టీఆర్ ఇటలీలో ఉన్నారు. దాడి గురించి తెలిసిన హరికృష్ణ కార్యాలయానికి వచ్చి పరిస్థితులను సమీక్షించారు.


అయితే దీనిపై రాజ్యసభ సభ్యుడు ఎన్.టి.ఆర్.కుమారుడు హరికృష్ణ దాడి ఘటనను ఆకతాయిల పనిగా పేర్కొన్నారు. దీనిని కుటుంబాల మధ్య తగాదాగా భావించరాదని, అలా మార్చవద్దని హరికృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే దాడి చేసి తెలుగుదేశం పార్టీ పైన జూనియర్‌ను రెచ్చగొట్టే విధంగా కుతంత్రాలకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. జూనియర్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...