కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ టిడిపి నేతలు

posted on: Jul 11, 2012 5:19PM

టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. జైల్లో జగన్ రాసిన స్ట్రిప్టునే కొడానాని చదివారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాజకీయ దిగజారుడుతనానికి నాని తీరే నిదర్శనమన్నారు. నానికి మతి భ్రమించిందని, పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

 


నాని చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని మరో నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటే, నీకు టికెట్ ఇస్తే ఎంత డబ్బు ఇచ్చావని ప్రశ్నించారు నానిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కరెక్టే అని వర్లరామయ్య తెలిపారు.
 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...