Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అన్నిట్లోనూ ఆరితేరిన విజయసాయిరెడ్డి?
posted on: Jul 11, 2012 11:20AM
మొత్తం అన్నిట్లోనూ ఆరితేరిన మేథావుల కోటాలో వై.కా.పా. అథినేత జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని లెక్కించవచ్చు. అసలు బెయిల్ రావటమే కష్టమైన (జగన్‌ఆక్రమాస్తుల)కేసులో నిందితుని(ఎ2)గా కొనసాగుతూనే సాయిరెడ్డి బాహ్యాప్రపంచంలో ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తనను తాను కాపాడుకుంటూ న్యాయసలహాలను చక్కగా పాటిస్తూ న్యాయస్థానం అనుమతితోనే తన అన్ని పనులూ ఆయన చక్కబెట్టుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయసాయిరెడ్డి బయట ఉంటే జగన్ బయట ఉన్నట్లే అని లోతుగా ఆ కేసులు అథ్యయనం చేసిన న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి హస్తం లేకుండా ఎటువంటి పని చేయని జగన్‌ను బయటపడేసేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఇది వాస్తవమైనా కావచ్చు. ఎందుకంటే తిరుపతి దర్శనం తరువాత సాయిరెడ్డి మాట్లాడుతూ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందంటూ తనపై వచ్చిన కేసును పట్టించుకోనట్లే మాట్లాడారు. అలానే జగన్ గురించి గొప్పగా అభివర్ణించారు. ఈ ప్రకటనను బట్టి సాయిరెడ్డి భవిష్యత్తులో జగన్ విడుదలకు ఉన్న అన్ని అవకాశాలూ పరిశీలిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా హైకోర్టును తన న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు ఢల్లీి వెళ్లాల్సి ఉంటుందని సాయిరెడ్డి విన్నవించుకున్నారు. హైకోర్టు కూడా ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ 20 వరకూ ఎన్నిసార్లయినా ఢల్లీి వెళ్లిరావచ్చని స్పష్టం చేసింది. తన పనితో పాటు సాయిరెడ్డి స్వామికార్యం చక్కబెట్టుకురాగలరని వై.కా.పా.నేతలు ఆశిస్తున్నారు. ఇదెంత వరకూ నిజమో త్వరలో తెరపైనే చూడాలి మరి



.jpeg)


