జగన్‌ను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్ట్ అనుమతి

posted on: Jul 6, 2012 4:32PM

అక్రమాస్తుల కేసులో  చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్‌రెడ్డిని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అనుమతి లభించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ హోదాలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు విచారించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. మొదటగా దాఖలైన మూడు చార్జీషీట్లకు సంబంధించి జగన్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. జగతి పబ్లికేషన్‌లో పెట్టిన పెట్టుబడులు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...