జగన్ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు జూలై 4కు వాయిదా

posted on: Jun 28, 2012 5:06PM

jagan bail news, jagan arrested, jagan assets case, jagan jail life, jagan bail news todayఅక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం జూలై 4కు వాయిదా వేసింది. జగన్‌ తరపున ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ, సీబీఐ తరపున అశోక్‌భాన్‌ వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలు నిన్న అసంపూర్తిగా ముగియడంతో ఈరోజు కొనసాగించారు. మౌనంగా ఉండడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాంజెత్మలానీ సిబిఐ విచారణలో జగన్ వైఖరిని కోర్టులో సమర్థిస్తూ వాదించారు. తమకు కావాల్సిన సమాధానాలను మాత్రమే జగన్ నుంచి రాబట్టడానికి సిబిఐ ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అరెస్టు అక్రమమని ఆయన అన్నారు. ముగ్గురు సాక్షులను వాంగ్మూలం ఇవ్వకుండా బెదిరించారని సిబిఐ ఆరోపిస్తోందని, సిబిఐ మాటలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్టు చేయడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని ఆయన వాదించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...